కోర్టు కేసు హాజరై బయటికి వస్తుండగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ దాడిచేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. స్థానిక కోర్టులో పనిచేసే వెంకటేశ్వర్లు కొడుకు విజయ్ భాస్కరాచారితో ఏడాది క్రితం అబ్బనపురి వెంకటేశ్వర్లు కుమార్తె భవానీ వివాహం జరిగింది. 16 రోజుల తర్వాత తన కూతురిపై అభాండాలు వేసి విడాకుల పిటిషన్ వేశారన్నారు వెంకటేశ్వర్లు. ఈ నేపథ్యంలో కోర్టు హాజరై వస్తున్న తమపై హెడ్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశాడని బాధితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.