Credit Card : ఇండస్‌ఇండ్-జియో-బీపీ మొబిలిటీ+ కార్డ్‌తో రూ.2.5 లక్షల ఇంధనం ఉచితం..త్వరగా తీస్కోండి.
Credit Card : ఇంధన ఖర్చులు, రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇండస్‌ఇండ్ బ్యాంక్ , జియో-బీపీ సంస్థలు సంయుక్తంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ జియో-బీపీ మొబిలిటీ+ క్రెడిట్ కార్డ్ ను మార్కెట్లో విడుదల చేశాయి. ఇది ఒక కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ముఖ్యంగా ఇంధనంపై అధిక ప్రయోజనాలు, లైఫ్‌స్టైల్ రివార్డులు కోరుకునే కస్టమర్ల కోసం రూపొందించబడింది. ఈ కార్డు RuPay నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. UPI ద్వారా కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇంధన కార్డుల విభాగంలో ఇది ఒక వినూత్నమైన డిజిటల్, ఇంధన ప్రయోజనాల కలయికగా పరిగణించబడుతోంది.
ఈ మొబిలిటీ+ క్రెడిట్ కార్డు దేశవ్యాప్తంగా ఉన్న జియో-బీపీ 2,050 కంటే ఎక్కువ మొబిలిటీ స్టేషన్లలో ప్రత్యేకమైన ఇంధన రివార్డులను అందిస్తుంది. జియో-బీపీ అవుట్‌లెట్లలో ఇంధనం, కన్వీనియన్స్ స్టోర్లు, వైల్డ్‌బీన్ కేఫ్‌లలో ప్రతి రూ.100 ఖర్చుపై 12 రివార్డు పాయింట్లు లభిస్తాయి. డైనింగ్, సూపర్ మార్కెట్లు, కిరాణా కొనుగోళ్లపై ప్రతి రూ.100 ఖర్చుపై 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి. జియో-బీపీ సీఈఓ అయిన అక్షయ్ వాధ్వా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కార్డుతో వినియోగదారులు సంవత్సరానికి 60 లీటర్ల వరకు ఉచిత ఇంధనాన్ని పొందవచ్చు. దీనితో పాటు, వారికి 4.25 శాతం వరకు వాల్యూ బ్యాక్ కూడా లభించే అవకాశం ఉంది.
ఈ కొత్త క్రెడిట్ కార్డు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక వెల్‌కమ్, మైల్‌స్టోన్ ఆఫర్లను అందిస్తోంది. కార్డు యాక్టివేట్ అయిన 30 రోజుల్లో మొదటి ఇంధన లావాదేవీపై 400 బోనస్ రివార్డు పాయింట్లు లభిస్తాయి. మొదటి వైల్డ్‌బీన్ కేఫ్ లావాదేవీపై ఒక ఉచిత కూపన్ ఇస్తారు. ప్రతి నెల జియో-బీపీ ఎకోసిస్టమ్‌లో రూ.4,000 ఖర్చు చేస్తే, 200 బోనస్ రివార్డు పాయింట్లు వస్తాయి. సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కార్డ్‌హోల్డర్‌లకు 4,000 వరకు బోనస్ రివార్డు పాయింట్లు లభించే అవకాశం ఉంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అయిన రాజీవ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ కార్డు వినియోగదారులకు మెరుగైన, స్మార్ట్ మొబిలిటీ అనుభవాన్ని అందిస్తుందని, ఇది ఇన్నోవేషన్, కస్టమర్ అవసరాలపై తమ నిబద్ధతను తెలియజేస్తుందని తెలిపారు. జియో-బీపీ ఛైర్మన్ సార్థక్ బెహురియా ప్రకారం.. ఈ డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా రోజువారీ ఇంధన ఖర్చును మరింత లాభదాయకంగా మార్చడం వారి లక్ష్యం.