తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోడిగుడ్డుమీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రతి పనినీ అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక కేసులు వేశారని గుర్తు చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా.. నూతన సచివాలయం నిర్మించి తీరుతమన్నారు. జనం మధ్యకు వెళ్లలేని కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తలసాని ఫైర్ అయ్యారు.