KCR: జై కేసీఆర్ నినాదాలతో దద్దరిల్లిన నందీనగర్
బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ కీలక భేటీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన నివాసంలో నాలుగున్నర గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం కేసీఆర్ తన నివాసంలో నుంచి కార్యకర్తలకు అభివాదం చేశారు. పోలీసులను నెట్టుకుంటూ అభిమానులు కేసీఆర్ నివాసం నందినగర్ కు చేరుకున్నారు. జై కేసీఆర్, సీఎం సీఎం నినాదాలతో హోరెత్తించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్.. కేటీఆర్, హరీష్ రావులతో సమావేశమయ్యారు. అనంతరం నందినగర్ నివాసం నుంచి పార్టీ కార్యకర్తలకు పిడికిలి చూపించి అభివాదం చేశారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 10 రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై చర్చించి, దిశా నిర్దేశం చేశారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలంగా ఉందని, బరిలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని, త్వరలోనే పార్టీలో చాలామంది చేరుతారని తెలిపారు. ఎమ్మెల్యేలతో సమావేశం ముగిసిన అనంతరం నందినగర్ నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ వెళ్లారు. గ్రౌండ్ లెవల్లో పార్టీ బలంగా ఉందని, ఎక్కడా రెబల్స్ బరిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని, త్వరలోనే పలువురు నేతలు పార్టీలో చేరే అవకాశముందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ నందినగర్ నివాసం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు.