త్వరలో తెలుగురాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లు

Update: 2019-07-02 04:45 GMT

రెండు తెలుగురాష్ట్రాలకు త్వరలో వేర్వేరు గవర్నర్లు వచ్చే అవకాశముందని హోంశాఖ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్నపార్లమెంట్ సమావేశాల అనంతరం గవర్నర్ల నియామకాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ 2009 నుంచి కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు వచ్చిన ఆయన ఇప్పటికీ ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. విభజన సమస్యలు, ఉమ్మడి రాజధాని నేపథ్యంలో అనివార్యంగా నరసింహన్ ను కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ తమ రాజధానుల నుంచి పాలన సాగిస్తున్నాయి. హైకోర్టు విభజన కూడా పూర్తి అయింది. ఈ నేపథ్యంలో వేర్వేరు గవర్నర్లను నియమించాలని భావిస్తన్నారు. రాజకీయపార్టీలు కూడా ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశాయి.

పదేళ్లుగా నరసింహన్ ఇక్కడ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన్ను ఒక్కరాష్ట్రానికి పరి ఉండడంతో ఆయన్ను ఒకరాష్ట్రానికి పరిమితం చేస్తారా? లేక పూర్తిగా బాధ్యతల నుంచి పంపుతారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడి నుంచి నరసింహన్ ను పంపి.. జమ్మూకాశ్మీర్ వ్యవహరాల సలహాదారుగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఐబీ చీఫ్ గా పనిచేసిన అనుభవంతో పాటు తెలంగాణ ఉద్యమ సమయంలో సంయమనంతో వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. విజయవాడలో ఇంతకాలం సీఎం వాడుకున్న కార్యాలయాన్ని గవర్నర్ ఆఫీసుగా మార్చేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కొత్త గవర్నర్ వస్తుండడంతోనే రెడీ చేస్తున్నారనే ప్రచారముంది.

Similar News