JAGAN: జగన్‌ బంధువు అర్జున్‌రెడ్డి అరెస్ట్‌

వైసీపీ అధినేతకు మరో షాక్

Update: 2025-12-19 09:15 GMT

 వైసీపీ అధినేత జగన్ బంధువు అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ వారి కుటుంబసభ్యుల ఫొటోలు అసభ్యంగా మార్పింగ్ చేయటంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణకు హాజరైన అర్జున్ రెడ్డిని పీఎస్‌లో అరెస్ట్ చేశారు. అర్జున్‌రెడ్డి.. జగన్‌కు బాబాయ్‌ వరసయ్యే వైఎస్‌ ప్రకాశ్‌రెడ్డి మనవడు. గతం­లో అర్జు­న్‌­రె­డ్డి­ని అరె­స్ట్‌ చే­సేం­దు­కు యత్నిం­చ­గా వి­దే­శా­ల­కు పరా­ర­య్యా­రు. దీం­తో పో­లీ­సు­లు ఆయ­న­పై లు­కౌ­ట్‌ నో­టీ­సు­లు జారీ చే­శా­రు. ఈనెల 8వ తే­దీన వి­దే­శాల నుం­చి తి­రి­గి రా­వ­డం­తో శం­షా­బా­ద్‌ ఎయి­ర్‌­పో­ర్టు­లో ఇమి­గ్రే­ష­న్‌ అధి­కా­రు­లు అడ్డు­కు­ని పో­లీ­సు­ల­కు సమా­చా­రం ఇచ్చా­రు. గు­డి­వాడ పో­లీ­సు­లు అర్జు­న్‌­రె­డ్డి­ని అదు­పు­లో­కి తీ­సు­కు­ని 41 ఏ నో­టీ­సు­లు ఇచ్చా­రు. ఉమ్మ­డి కడ­ప­తో పాటు మరి­కొ­న్ని జి­ల్లా­ల్లో­నూ అత­డి­పై కే­సు­లు నమో­ద­య్యా­యి.  దీంతో జగన్ కు మరో షాక్ తగిలినట్లు అయింది.

కొడాలి నాని అనుచరుడు అరెస్ట్‌

వై­సీ­పీ నేత, మాజీ మం­త్రి కొ­డా­లి నాని అను­చ­రు­డు కూ­న­సా­ని వి­నో­ద్‌­ను పో­లీ­సు­లు అరె­స్ట్‌ చే­శా­రు. ఆన్‌­లై­న్‌­లో క్రి­కె­ట్‌ బె­ట్టిం­గ్‌ ని­ర్వ­హి­స్తు­న్నం­దున అత­డి­ని గు­డి­వాడ వన్‌­టౌ­న్‌ పో­లీ­సు­లు అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. వి­నో­ద్‌ నుం­చి రూ.50వేల నగదు, మొ­బై­ల్‌ ఫో­న్‌­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. వై­కా­పా అధి­కా­రం­లో ఉం­డ­గా అడ్డూ అదు­పు లే­కుం­డా జూద శి­బి­రా­లు ని­ర్వ­హిం­చి­న­ట్లు అత­డి­పై ఆరో­ప­ణ­లు­న్నా­యి. కూ­ట­మి ప్ర­భు­త్వం వచ్చాక కూడా ఆ శి­బి­రా­లు ని­ర్వ­హి­స్తుం­డ­టం­తో పో­లీ­సు­లు వి­నో­ద్‌­పై కేసు నమో­దు చే­శా­రు.

Tags:    

Similar News