పూరన్‌ వెనుక ఓ విషాద గాధ..!

Update: 2019-07-05 13:17 GMT

ప్రపంచ కప్ ముందు అతనేంటో అందరికి అంతగా తెలియదు. జట్టులో అందరూ విఫలమవుతున్న అతను విరోచిత పోరాటం చేస్తున్నాడు. అతనే వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పూరన్‌. ఇప్పుడు ప్రపంచ కప్‌లో అతను పేరే మారుమెగుతుంది. శ్రీలంకతో మ్యాచ్‌ వరకు అతను పెద్దగా పరిచయంలేని ఆటగాడు. కానీ ఆ మ్యాచ్‌లో సహచర ఆటగాళ్ళు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుతున్న అతను మాత్రం పొరాడి శతకం సాధించాడు. జట్టు ఓడిన అతను మాత్రం గెలిచాడు. అయితే మనం మైదానంలో పూరన్‌ పొరాటపటిమను మాత్రమే చూశాం. కానీ అతని జీవితంలో మంచానికే పరిమితమైన ఓ విషాద గాధ ఉంది. అతని మనస్సులో పుట్టెడు దుఃఖాన్ని మోశాడు. అనుకుని ఓ సంఘటనలో 7 నెలలు మంచం పైనే ఉన్నాడు.

2015లో ట్రినిడాడ్‌లో రోడ్డుప్రమాదానికి గురై దాదాపు 7 నెలలు నడువలేక పడుకునే చోటే ఉండిపోయాడు. కారు ప్రమాదంలో రెండు కాళ్లు,నడుం విరిగి శరీరం సగ భాగం చచ్చుబడిపోయింది. ఈ సంఘటన అతని జీవితాన్ని సంశయంలో పడేసింది. కానీ అతని సంకల్పాన్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. తిరిగి క్రికెట్ ఆడాలన్న తపనను ఏమాత్రం తగ్గించలేకపోయింది. డాక్టర్ సలహాలతో తిరిగి కోలుకుని పరుగెత్తడం ప్రారంభించాడు. తిరిగి బ్యాట్ పట్టి ఒక్కో అడుగు వేసుకుంటూ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి జాతీయ జట్టులో చోటు సంపాందిచాడు.

Similar News