RCB vs GT: జాక్స్ మెరుపు సెంచరీ..ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత

బెంగళూరు ఘన విజయం

Update: 2024-04-28 23:00 GMT

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తొమ్మిది వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మరో 24 బంతుల్లో ఉండగానే గెలుపొందింది. గుజరాత్ భారీ స్కోరు చేసినప్పటికీ.. ఆర్సీబీ బ్యాటర్లు విల్ జాక్స్ (100*) సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆర్సీబీ విజయం నమోదు చేసుకుంది. అతని ఇన్నింగ్స్ లో 10 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

అంతకుముందు.. ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (70*), డుప్లెసిస్ (24) పరుగులతో రాణించారు. ఈ ఇన్నింగ్స్ లో గుజరాత్ బౌలర్లకు విల్ జాక్స్, విరాట్ కోహ్లీ ఊచకోత చూపించారు. 10 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీకి ఇది 3వ విజయం. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. మరోవైపు.. అటు గుజరాత్ బౌలింగ్ లో కేవలం సాయి కిషోర్ ఒక్కడే ఒక్క వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లంతా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ (84*) పరుగులతో రాణించాడు. షారూఖ్ ఖాన్ (58), డేవిడ్ మిల్లర్ (26*), గిల్ (16), సాహా (5) పరుగులు చేశారు. దీంతో గుజరాత్ 200 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్, మ్యాక్స్ వెల్ తలో వికెట్ తీశారు. . 10 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీకి ఇది 3వ విజయం. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.డబుల్ హ్యాట్రిక్ ఓటములతో తర్వాత గెలుపు బాట పట్టిన బెంగళూరుకు వరుసగా ఇది రెండో విజయం.

Tags:    

Similar News