బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌తో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం

Update: 2019-07-06 06:05 GMT

బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌తో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేగింది. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో.. విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. అప్రమత్తమైన CISF భద్రతాసిబ్బంది విమానాన్ని నిలిపేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు.. ఫోన్‌కాల్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. హైదరాబాద్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. అందులోని ఓ ప్రయాణికుడికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. విమానంలో బాంబు ఉందని చెప్పాడతను. దీంతో.. ఆ ప్రయాణికుడు భద్రతా సిబ్బందికి చెప్పడంతో.. వాళ్లు అప్రమత్తయ్యారు. టేకాఫ్‌కు సిద్ధమైన విమానాన్ని నిలిపేసి.. ప్రయాణికుల్ని దించేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లు క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాయి. బాంబులేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Similar News