తన భార్యకు చెందాల్సిన భూమి పత్రాలను మార్చి.. తనకు పట్టాదార్ పుస్తకాలుగా ఇవ్వడం లేదంటూ నిర్మల్ కలెక్టరేట్ వద్ద అర్ధనగ్నంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి. దిలాపూర్ గ్రామంలో 6 ఎకరాల భూమి.. రఘువీర్ రావు అనే వ్యక్తి భార్యకు ఆమె తండ్రి ద్వారా సంక్రమించింది. అయితే మండల అధికారులతో కుమ్మక్కైన రఘువీర్ రావు బావమరిది ప్రతాప్‌రావు.. దాన్ని తన పేరున మార్చుకున్నాడు. దీనిపై అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవ్వరూ స్పందించలేదు. దీంతో విసుగు చెందిన రఘువీర్‌రావు.. నిర్మల్ కలెక్టరేట్‌లో అర్ధనగ్నంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో.. రఘువీరా రావు శాంతించాడు.