వాషింగ్టన్‌ను ముంచెత్తిన వరద నీరు

Update: 2019-07-09 08:11 GMT

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ను వరద నీరు ముంచెత్తింది. గంట వ్యవధిలో రికార్డు స్థాయిలో భారీ వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు భారీగా నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వరదలో కార్లు కొట్టుకుపోయాయి. కార్లు నీటమునగడంతో వాహనదారులు వాటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి

15 మంది రెస్క్యూ సిబ్బంది కాపాడారు. వర్షం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఒక్క గంట వ్యవధిలో 8.4 సెంటీమీర్ల వర్షం పడినట్టు అమెరికా జాతీయ వాతావరణ సంస్థ తెలిపింది. దీంతో 1958లో ఒక గంటలో కురిసిన 5.6 సెంటీమీటర్ల వర్షం రికార్డు బద్దలైంది. భారీ వర్షాల ప్రభావం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను తాకింది. వైట్‌హౌస్‌ బేస్‌మెంట్‌లోని కార్యాలయాల్లోకి కొద్దిపాటి వరద నీరు చేరింది. వాషింగ్టన్‌లో కురిసిన వర్షం ప్రమాదకర పరిస్థితులను తలపించిందని వాతావరణ సంస్థ తెలిపింది. అటు ఆర్లింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల్లోనూ 12 సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షం ముంచెత్తింది.

Similar News