తనపై కోమటి రెడ్డి మతితప్పి ఆరోపణలు చేశారని మండిపడ్డారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. అన్ని అనుమతులు తీసుకునే తన గ్రామంలో ఇల్లు కట్టుకున్నానని తెలిపారు. ఓ బీసీ నేత ఎదగడాన్ని కోమటి రెడ్డి ఓర్చుకోలేక పోతున్నారన్న శంభీపూర్ రాజు.. తనపై కబ్జా ఆరోపణలు కోమటి రెడ్డి నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ఎంపీ పదవి కి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోమటి రెడ్డి క్షమాపణ చెప్పాలని.. లేదంటే పరువు నష్టం దావా వేస్తానన్నారు శంభీపూర్ రాజు.