పురుషోత్తపట్నంపై ఎన్జీటీ ఆగ్రహం..

Update: 2019-07-15 12:43 GMT

అనుమతుల్లేకుండా పురుషోత్తపట్నం ప్రాజెక్టు కడుతుంటే ఏం చేస్తున్నారని..కేంద్ర పర్యావరణ, అటవీశాఖపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ప్రత్యేకంగా డీపీఆర్ ఉన్నప్పుడు పోలవరంలో భాగం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పురుషోత్తపట్నం ప్రాజెక్టు చేపట్టారని మండిపడింది ఎన్జీటీ.నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అటు తాము ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను నివేదిస్తామని ఇందుకోసం సమయం కావాలని కోరింది కేంద్ర పర్యావరణ శాఖ. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది జాతీయ హరిత ట్రైబ్యునల్ .అనుమతుల్లేకుండా పురుషోత్తపట్నం నిర్మిస్తున్నారని ఎన్జీటీలో... జమ్ముల చౌదరయ్య, సత్యనారాయణ, రామకృష్ణ పిటిషన్ వేశారు.

Similar News