హైదరాబాద్, ఉమ్మడి నల్గొండతోపాటు పలు జిల్లాల్లో భారీ సెటిల్మెంట్లు చేసిన నయీం గ్యాంగ్ అరాచకాలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతని భార్య, బంధువులు, ప్రధాన అనుచరగణం అందరినీ పీడీ యాక్టుతో వరంగల్ జైల్లో వేశారు. ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చినా వీళ్ల ఆగడాలు ఆగడం లేదు. బెదిరింపులు, దందాలు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా రాజకొంచ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలతో .. మరోమారు నయీం భార్య సహా ముగ్గురిపై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మళ్లీ వరంగల్ జైల్‌కు పంపారు. తాజాగా నయీం తల్లి తహేరా బేగంను కూడా అరెస్ట్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు. కిడ్నాప్, భూకబ్జా, చీటింగ్ సహా 12 కేసులతో తహేరా బేగంకు సంబధం ఉన్నట్టు తేల్చారు. దీనిపై ఇప్పుడు లోతైన విచారణ జరపనున్నారు.