ఓ భారీ మొసలి సడెన్‌గా కంటి ముందు ప్రత్యక్షమైతే. భయంతో గుండె ఆగిపోతుంది. ఏ మాత్రం తేడా వచ్చినా మొసలి నోట్లో ఆహారం అయిపోతాం. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమళ్ల గ్రామస్థులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు.జూరాల ప్రధాన ఎడమకాలవలో నీరు లేక మొసలి ఒడ్డుపైకి వచ్చింది. దారిన పోయే గ్రామస్థులు మొసలిని చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. డేర్ చేసిన కొందరు మొసలి నోటికి తాడు బిగించి తిరిగి నీళ్లలోకి వదిలారు. అయితే మళ్లీ అదే కాలువలో వదలడంతో జనాల్లో తగ్గకపోగా కొత్త టెన్షన్ మొదలైంది. మళ్లీ మొసలి ఎప్పుడొస్తుందోనని భయపడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి జూరాల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో వదిలేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.