హైదరాబాద్ హయత్‌నగర్‌లో కిడ్నాపైన.. సోనీ ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. తమ కూతురు ఎక్కడుందో తెలియక ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు. బీఎస్సీ నర్సింగ్ చదువుతోన్న సోని రెండ్రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైంది. ఉస్మానియా ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి ఆమెను కారులో తీసుకెళ్లాడు. అయితే సాయంత్రమైనా రాకపోవడంతో.. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా సోనీ కోసం గాలిస్తున్నారు. కారులో తీసుకెళ్లే దృశ్యాలు, ఆ కారు నెంబర్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.