రోజు రోజుకు టిక్‌టాక్ మోజు శృతిమించిపోతోంది. పాటలతో తమ హావభావాలను ప్రదర్శిస్తూ వాటిని అమ్మాయిలకు పంపిస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇదే కోవలో ఓ లెక్చరర్ విద్యార్థినుల్నివేధింపులకు గురిచేశాడు. విద్యార్ధులకు ఆదర్శంగా ఉండి.. వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన లెక్చరర్ వేధింపులకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కాలేజీలో HODగా పనిచేస్తున్న సురేందర్.. విద్యార్థినుల్ని లైంగికంగా టార్చర్ చేశాడు. వాట్సాప్‌లో అసభ్యకర పోస్టులు , టిక్‌టాక్ వీడియోలు పంపాడు. తన రూంకు రావాలని, లేదంటే.. సంబంధిత సబ్జెక్ట్ లో ఫెయిల్ చేస్తానంటూ బెరింపులకు పాల్పడ్డాడు. సురేందర్ వెకిలిచేష్టలకు కొంతమంది విద్యార్థినులు చదువే మానేశారు. మరికొంత మంది స్టూడెంట్స్ వేధింపులపై యాజమాన్యానికి ఫిర్యాదులు చేశారు.
HOD సురేందర్ చేష్టలు ఎక్కువ కావడంతోతో కొంతమంది ధైర్యం చేసి ఇంట్లో చెప్పడంతో.. పేరెంట్స్ ఫిర్యాదుతో యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సురేందర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకుంది. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. లైంగికంగా వేధించిన వ్యక్తిని సస్పెండ్ చేశామని చెప్పిఊరుకుంటే..రేపు మరోచోట ఇదే పరిస్థితి రాదని గ్యారెంటీ ఏంటని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. వేధింపులకు పాల్పడ్డ సురేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.