గోదావరి పరవళ్లు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ

Update: 2019-07-31 12:44 GMT

ఎడతెరిపిలేని వర్షాలకు తోడు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత ఐదు రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తన్నాయి. దీనికి తోడు తెలంగాణలో మొస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో చెరువులు కుంటలు, వాగులు వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి 7.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

Full View

ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పూర్తి లెవెల్‌ 100 మీటర్లు కాగా.. ఇప్పటికే 96 మీటర్లకు నీరు చేరింది. దీంతో 30 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్‌ ఫ్లో 2.0 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉండగా.. అవుట్‌ ప్లో 2.0 లక్షల క్యూ సెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.

Similar News