పలకరించే వారు లేరు.. పడుకుంటే నిద్ర రావట్లేదు.. అయినా మీ ట్రైన్ జర్నీ ఆనందంగా గడిచిపోవాలంటే.. బోర్ కొట్టకుండా ఉండాలంటే.. 'రైల్‌టెల్' అనే యాప్‌ని మీ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకుంటే హ్యాపీగా మీకు నచ్చిన సినిమాలు, సీరియల్సు, వార్తలు లాంటివి అన్నీ చూసేయొచ్చు. రైలు కదులుతున్నప్పుడు కూడా ఈ వీడియోలు ఎలాంటి ఆటకం లేకుండా వీక్షించవచ్చు. రైల్‌టెల్ అందుబాటులోకి తెచ్చే యాప్‌లో ప్రీలోడెడ్ వీడియోలు, సంగీత, వినోద కార్యక్రమాలు, టీవీ సీరియల్స్, భక్తి కార్యక్రమాలు, లైఫ్‌స్టైల్ సంబంధిత వీడియోలు ఉంటాయి. దీనికోసం రైల్‌టెల్ టెలికం కంపెనీతో రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.