ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు. జమ్మూకాశ్మీర్ ప్రజలకు మేలు కలగాలని కోరుకుంటున్నాని ట్వీట్ చేశారు.
అంతకు ముందు గుంటూరు పార్టీ కార్యాలయంలో సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు. జమ్మూకశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నేతలతో చర్చించారు. నేతల అభిప్రాయాలు తెలుసుకున్నాకే ట్విట్టర్ ద్వారా తన మద్దతిస్తున్నట్లు తన అభిప్రాయాన్ని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా నేతలతో చర్చించారు టీడీపీ అధినేత.
Telugu Desam Party supports the Union Govt as it seeks to repeal Article 370. I pray for the peace and prosperity of the people of J&K.#Article370
— N Chandrababu Naidu (@ncbn) August 5, 2019