రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలైన చర్చ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది.
ఈ బిల్లులకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ కూడా విడుదల చేశారు. రాజ్యసభలో బిల్లుకు అనూకూలంగా 125, వ్యతిరేకంగా 61 ఓట్లు రావడంతో బిల్లులకు సభామోదం లభించింది. ఇప్పుడు జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 351మంది, వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. దీంతో ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినట్టయింది.