BULLET TRAIN: హైదరాబాద్‌కు దూసుకొస్తున్న బులెట్‌ ట్రైన్

తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో శుభవార్త... బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసిన నిర్మలమ్మ... భాగ్యనగరానికి దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్

Update: 2026-02-01 08:00 GMT

కేంద్ర బడ్జెట్‌ 2026లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాధాన్యం ఇచ్చింది. నగరాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ ద్వారా ఆర్థిక వృద్ధిని మరింత ఉద్ధీపన చేయాలన్న లక్ష్యంతో ఏడు కొత్త హై-స్పీడ్ రైల్ కారిడార్లను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే దేశ రైల్వే వ్యవస్థలోనే కాకుండా వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి, “హై-స్పీడ్ రైల్ కారిడార్లు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తాయి” అని తెలిపారు. ముఖ్యంగా మెట్రో నగరాలు, ఆర్థిక కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా సదుపాయాలను అందించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆమె వివరించారు.

అపార ఉద్యోగావకాశాలు

ఈ హై-స్పీ­డ్ రైలు కా­రి­డా­ర్లు నగ­రాల మధ్య ప్ర­యాణ సమ­యా­న్ని గణ­నీ­యం­గా తగ్గిం­చ­డం­తో పాటు, వ్యా­పా­రం, పరి­శ్ర­మ­లు, ఉద్యోగ అవ­కా­శాల పె­రు­గు­ద­ల­కు దో­హ­ద­ప­డ­తా­య­ని తె­లి­పా­రు. ము­ఖ్యం­గా మె­ట్రో నగ­రా­లు, ఆర్థిక కేం­ద్రాల మధ్య వే­గ­వం­త­మైన రవా­ణా సౌ­క­ర్యం కల్పిం­చ­డ­మే ఈ ప్రా­జె­క్టుల ప్ర­ధాన లక్ష్య­మ­ని చె­ప్పా­రు. దీ­ని­లో భా­గం­గా.. 7 నగ­రాల మధ్య హై­స్పీ­డ్ కా­రి­డా­ర్ల ఏర్పా­టు­కు ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు తె­లి­పా­రు.ఇవి నగ­రాల మధ్య కనె­క్టి­వి­టీ­ని బలో­పే­తం చే­సేం­దు­కు దో­హ­దం చే­స్తా­య­ని తె­లి­పా­రు. దే­శం­లో 7 నగ­రా­ల­ను కలు­పు­తూ వే­స్తో­న్న ఈ హై­స్పీ­డ్ రైలు కా­రి­డా­ర్‌­లో హై­ద­రా­బా­ద్​­ను మూడు కా­రి­డా­ర్లు కలు­స్తా­యి. ఈ రైలు కా­రి­డా­ర్లు అమ­లు­లో­కి వస్తే.. ప్ర­యా­ణి­కు­ల­కు సౌ­క­ర్య­వం­త­మైన, సు­ర­క్షి­త­మైన రవా­ణా అం­ద­డ­మే కా­కుం­డా.. లా­జి­స్టి­క్స్ రం­గా­ని­కి కూడా బల­మైన మద్ద­తు లభి­స్తుం­ద­ని ప్ర­భు­త్వం అం­చ­నా వే­స్తోం­ది

ఈ హై-స్పీ­డ్ రైల్ కా­రి­డా­ర్ల ని­ర్మాణ దశ­లో­నే కా­కుం­డా, అవి పూ­ర్త­యిన తర్వాత కూడా పె­ద్ద ఎత్తున ఉపా­ధి అవ­కా­శా­లు ఏర్ప­డ­తా­య­ని ఆర్థిక మం­త్రి తె­లి­పా­రు. ని­ర్మాణ పనుల కోసం ఇం­జి­నీ­ర్లు, సాం­కే­తిక ని­పు­ణు­లు, కా­ర్మి­కు­లు అవ­స­రం అవు­తా­రు. అలా­గే ఆప­రే­ష­న్, ని­ర్వ­హణ దశలో కూడా వే­లా­ది ఉద్యో­గా­లు సృ­ష్టిం­చ­బ­డ­తా­య­ని అం­చ­నా. ఈ ప్రా­జె­క్టుల చు­ట్టూ కొ­త్త వ్యా­పా­రా­లు, సేవా రం­గా­లు అభి­వృ­ద్ధి చెం­దే అవ­కా­శ­ముం­ది. హో­ట­ళ్లు, రవా­ణా సే­వ­లు, రి­య­ల్ ఎస్టే­ట్ రం­గా­లు ఈ కా­రి­డా­ర్ల వెంట వే­గం­గా ఎద­గ­ను­న్నా­య­ని ఆర్థిక వి­శ్లే­ష­కు­లు చె­బు­తు­న్నా­రు. బడ్జె­ట్‌ 2026లో ప్ర­క­టిం­చిన ఈ ఏడు హై-స్పీ­డ్ రైల్ కా­రి­డా­ర్లు దేశ రవా­ణా రం­గం­లో ఒక కొ­త్త యు­గా­ని­కి నాం­ది పలు­కు­తా­య­ని చె­ప్ప­వ­చ్చు. ఈ ప్రా­జె­క్టు­లు భా­ర­త్ ఆర్థిక ప్ర­గ­తి­కి ప్ర­ధాన చోదక శక్తి­గా మా­ర­ను­న్నా­య­ని కేం­ద్ర ప్ర­భు­త్వం వి­శ్వా­సం వ్య­క్తం చే­స్తోం­ది.

Tags:    

Similar News