వర్ష బీభత్సం.. బైక్‌తో సహా క్షణాల్లో కొట్టుకుపోయారు!

Update: 2019-08-10 06:34 GMT

దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ .. ఇక్కడ అని లేకుండా ప్రతి రాష్టాన్ని వర్షాలు ముంచెత్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో వరుణుడు భీభత్సం సృష్టిస్తున్నాడు. కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఏపీ రాష్ఱ్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి, కృష్ణ ,కావేరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీ వరదల కారణంగా 25 మంది మృతి చెందారు. వర్షం కారణంగా కొచ్చి విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. అలాగే కర్నాటక రాష్ట్రంలో కూడా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ఱ్రాలోని అన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. డ్యామ్‌లు పూర్తి స్థాయిలో నిండి ప్రమాదస్థాయికి చేరుకున్నాయి. అక్కడి వరద బీభత్సానికి అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Full View

బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు కాలువలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఆ రాష్ట్రంపై వరుణుడు ఎంతటి ప్రతాపాన్ని చూపిస్తున్నాడో తెలియజేస్తుంది. కొడగు జిల్లా కొరంగల్‌లో మట్టిరోడ్డుపై ఉన్న చిన్నపాటి వంతెన కింద నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఆ వంతెనపై నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా వారు వంతెన దాటుతున్న సమయంలోనే మట్టిరోడ్డుతో ఉన్న వంతెన తెగింది. దీంతో బైక్‌తో సహా ఆ ఇద్దరూ వరద నీటిలో కొట్టుకుపోయారు. అయితే వాళ్ళు ఏమయ్యారు అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. నీటిలో పడిపోయిన వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Similar News