హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమానాలిలో ప్రమాదవశాత్తు తెలుగు డాక్టర్ మృతి చెందాడు. విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ప్యారాచూట్ వేసుకుని గాల్లో విహరిస్తు ఉండగా ఒక్కసారిగా తెగిపడి కిందపడడంతో డాక్టర్ ఎల్. చంద్రశేఖర్‌రెడ్డి మృతి చెందాడు. సరదాకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. చంద్రశేఖర్ హైద్రాబాద్‌లోని నాగోల్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రవేట్ హాస్పిటల్‌లో ఫిజియోతెరపిస్ట్‌గా పని చేస్తున్నాడు. చంద్రశేఖర్ మృతితో అతని ఇంట్లో విషాదం నెలకొంది.