కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఫిలింనగర్‌లో సీనియర్ దర్శకుడి నివాసానికి వెళ్లారు. సుమారు గంటన్నర పాటు కేసీఆర్ చర్చించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం మర్యాదపూర్వకంగా తనను కలిశారని కె. విశ్వనాథ్ చెప్పారు. శ్రీకృష్ణుడు కుచేలుడి ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. అజ్ఞాత అభిమానిగానే ఇంటికి వచ్చారన్న కళాతపస్వి.. కేసీఆర్ సాహిత్య అభిరుచుని పంచుకున్నట్టు స్పష్టంచేశారు.