మోత్కుపల్లి నరసింహులు త్వరలో బీజేపీలో చేరనున్నారు. మోత్కుపల్లి నరసింహులు ఇంటికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఆయనతో రెండు గంటలపాటు సుధీర్ఘ చర్చలు జరిపారు. బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఇందుకు మోత్కుపల్లి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి... గత కొంత కాలంగా ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్నారు.