చాలా రోజుల తర్వాత నిండుకుండలా మారిన తుంగభద్ర

Update: 2019-08-12 09:07 GMT

చాలా రోజుల తర్వాత తుంగబద్ర నది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. దీంతో.. అదికారులు తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తివేసి 2లక్షల 50వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో.. తుంగబద్ర నది నుంచి విడుదలైన వరదనీరు మంత్రాలయం దాటి దిగువన ఉన్న సుంకేసులకు చేరుకుంది..ఈనేపథ్యంలో.. నిన్న మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన సుంకేసుల రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది.

Full View

ప్రసిద్ద పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రుని సన్నిధిలో తుంగభద్ర ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలతో కర్ణాటక రాష్ట్రంలోని హాస్సేట్ డ్యాంకు భారీగా వరదనీరు చేరడంతో 33 గేట్లు ఏత్తివేసి 2లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో.. తుంగభద్ర నది జలకళను సంతరించుకుంది. ఈనేపథ్యంలో.. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు తాగు,సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది. దీంతో.. రైతులు,ఇతర వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే.. ఈ నెల 14 నుంచి 20 వరకు శ్రీరాఘవేంద్ర స్వామి ఉత్సవాలు జరగనున్నాయి. కరెక్టుగా ఈ ఉత్సవాలు జరిగే సమయానికి తుంగభద్రకు నీళ్లు రావడంతో శ్రీరాఘవేంద్రస్వామే తుంగబద్రకు నీళ్లు తెప్పించాడని భక్తులు నమ్ముతున్నారు. తుంగభద్రకు నీరు రావడం పట్ల శ్రీమఠం పీఠీధిపతి శ్రీ సుభదేంద్రతీర్ధ స్వామీజీ హర్షం వ్యక్తం చేశారు.

Similar News