రష్యాలో మిరాకిల్ జరిగింది. పైలట్ చాకచక్యంతో అతి పెద్ద ప్రమాదం జరిగింది. 233 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఉరల్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి ఒక్కసారిగా పక్షుల గుంపు అడ్డుగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్ డిల్ విమానాన్ని అత్యవసరంగా మొక్కజొన్న చేనులో ల్యాండింగ్ చేశాడు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్న 233 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
జుకోవ్ స్కీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది. పైలట్ సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రష్యా వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.