నరేంద్ర మోదీ యూఏఈ పర్యటన

Update: 2019-08-19 01:33 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. ఆగస్టు 23 నుంచి 24 తేదీల్లో యూఏఈ మరియు ఆగస్టు 24 నుంచి 25 తేదీల్లో బహ్రెయిన్ కు వెళ్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. యూఏఈ పర్యటన లో భాగంగా అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను మోదీ కలవనున్నారు.

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేస్తూ మోదీ విశిష్ట నాయకత్వానికి గుర్తింపుగా.. యూఏఈ యొక్క అత్యున్నత పౌర అలంకరణ అయిన 'ఆర్డర్ ఆఫ్ జాయెద్‌' ను కూడా మోదీ అందుకొనున్నారు. యూఏఈ వ్యవస్థాపక తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ పేరిట ఈ అవార్డు షేక్ జాయెద్ పుట్టిన శతాబ్ది సంవత్సరంలో మోదీకి లభించినందున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక బహ్రెయిన్ లో పర్యటించనున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ చరిత్రలో నిలవనున్నారు.

Similar News