కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్

Update: 2019-08-21 16:26 GMT

కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను ఎట్టకేలకు సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను సీబీఐ హెడ్క్వార్టర్స్ కు తరలించారు. అంతకుముందు.. AICC కార్యాలయంలో చిదంబరం ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు, AICC ఆఫీసుకు వచ్చారు. వారిని లోపలికి రాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ గొడవ జరుగుతుండగానే చిదంబరం వెళ్లిపోయారు. సీబీఐ, ఈడీ అధికారులు AICC ఆఫీసు వద్ద వేచి ఉండగా, చిదంబరం చల్లగా తన ఇంటికి చేరుకున్నారు. దాంతో దర్యాప్తు బృందాలు చిదంబరం ఇంటికి వచ్చాయి. తొలుత అక్కడ ఎవరూ గేటు తీయకపోవడంతో.. కొందరు అధికారులు గేటు దూకి లోపలకు వెళ్లారు. మరికొందరు తీవ్రంగా ప్రయత్నించడంతో ఎట్టకేలకు గేటు తెరిచారు. దీంతో చిదంబరంను అదుపులోకి తీసుకున్నారు.'

 

Full View

Similar News