ప్రచారానికి నిధుల కొరత.. టిక్కెట్‌ను తిరిగి ఇచ్చేసిన కాంగ్రెస్ అభ్యర్థి
ఒడిశాలోని పూరీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు నిధుల కొరత కారణంగా తన ప్రచారానికి మద్దతు ఇవ్వలేనని లేఖ రాశారు.;
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశాకు చెందిన ఒక పార్టీ అభ్యర్థి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి నిరాకరించారు. కారణం ఆరా తీస్తే ప్రచారానికి తగినంత నిధులు లేని కారణంగా పోటీ నుంచి వైదొలగినట్లు పేర్కొన్నారు. ఆమెకు పార్టీ నుండి ఆర్థిక సహాయం అందడం లేదని తెలిపారు.
ఒడిశాలోని పూరీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మొహంతి శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాస్తూ తనకు నిధుల కొరత కారణంగా పార్టీ ప్రచారానికి మద్దతు ఇవ్వలేనని పేర్కొన్నారు.
మొహంతి తన లేఖలో, “పార్టీ నాకు నిధులు నిరాకరించినందున పూరీ పార్లమెంటరీ నియోజకవర్గంలో మా ప్రచారం తీవ్రంగా దెబ్బతింది.
ఏఐసీసీ ఒడిశా ఇన్‌చార్జ్ డాక్టర్ అజోయ్ కుమార్ జీ నన్ను నేను రక్షించుకోమని గట్టిగా కోరారు. తన ప్రచారానికి నిధులు సమకూర్చడంలో విఫలమైన కారణాలను పేర్కొంటూ, మొహంతి తన పొదుపు మొత్తాన్ని ప్రచారం కోసం ఖర్చు చేశానని, ఇంకా ఎక్కువ అందించలేకపోయానని చెప్పారు.
“నేను 10 సంవత్సరాల క్రితం ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చిన జీతం తీసుకునే ప్రొఫెషనల్ జర్నలిస్ట్. పూరీలో నా ప్రచారానికి నా దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశాను.
ప్రగతిశీల రాజకీయాల కోసం నా ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి నేను ప్రజా విరాళం డ్రైవ్‌ను ప్రయత్నించాను, ఇప్పటివరకు పెద్దగా విజయం సాధించలేదు. నేను అంచనా వేసిన ప్రచార వ్యయాన్ని కూడా కనిష్ట స్థాయికి తగ్గించడానికి ప్రయత్నించాను, ”అని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా, మొహంతి లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. ఇప్పుడు పోటీ చేయవద్దదనుకుంటున్నారు. మరోవైపు ఒడిశా స్థానం నుంచి బీజేడీ అభ్యర్థి అరుప్ పట్నాయక్, బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.