ఆ రెండు దేశాల మధ్య ప్రతిష్టంభనలు తొలిగే అవకాశం : దక్షిణ కొరియా

Update: 2019-08-22 14:18 GMT

అణ్వాయుధ నియంత్రణపై త్వరలో అమెరికా- ఉత్తర కొరియా దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని దక్షిణ కొరియా అభిప్రాయపడింది. ఈ చర్చల ద్వారా ఇరుదేశాలమధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న ప్రతిష్టంభనలు తొలిగే అవకాశం ఉందని దక్షిణ కొరియా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు కిమ్ హున్ చుంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాలోని అమెరికా రాయబారి స్టెఫెన్ బిగన్ తో సమావేశమైన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. గత ఫిబ్రవరిలో నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వియత్నాలో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో ఉత్తర కొరియా అణ్వాయుధ, క్షిపణి పరీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. జూన్ నెలలో ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్ లు ఉభయ కొరియా సరిహద్దులను సందర్శించిన సందర్భంగా ఇరుదేశాల మధ్య అధికారుల స్థాయి చర్చలకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే చర్చల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.

Similar News