సరస్వతి నిలయాలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ స్కూళ్లు పిక్నిక్ కేంద్రాలుగా మారిపోతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివారు తాళ్లగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విందులు చేసుకుని చిందులేశారు. వనభోజనాల పేరుతో స్కూల్‌ను బార్‌గా మార్చేశారు. పాఠశాల ఆవరణలో మద్యం బాటిల్స్, తిని పడేసిన ఆహారపదార్థాల వ్యర్థాలు దర్శనమివ్వడంతో.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.