హైదరాబాద్‌లోని.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మొత్తం 92 మంది ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ బ్యాచ్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఆరుగురు ఐపీఎస్‌లను కేటాయించారు. ఐపీఎస్ శిక్షణలో టాపర్ గా నిలిచిన గౌస్ అలంను తెలంగాణకు కేటాయించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ నరసింహన్, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తరహాలో నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేశారన్నారు. ఐపీఎస్‌లు 60 ఏళ్లు దేశానికి సేవ చేసే అవకాశం ఉందని, దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌ను భారత్‌లో కలపడానికి నిజాం ఒప్పుకోలేదు. అయినా సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని పరిపూర్ణం చేశారని తెలిపారు.