హై అలర్ట్.. తమిళనాడులో చొరబడిన టెర్రరిస్టులు..

Update: 2019-08-24 03:21 GMT

దేశంలో ఉగ్రవాద కదలికలు పెరిగిపోతున్నాయి. తాజాగా తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. లష్కరే తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు కోయంబత్తూర్‌లోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించా యి. ఇందులో ఒకరు పాకిస్థానీ కాగా, ఐదుగురు శ్రీలంక తమిళ ముస్లింలుగా భావిస్తున్నారు. హిందువులుగా వేషం మార్చి తమిళ నాడులోకి చొరబడ్డారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రదాడులకు కుట్ర పన్నార ని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. రద్దీ ప్రదేశాలు, ప్రముఖ రాజకీయ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే ప్రమాద ముందని పేర్కొన్నాయి.

నిఘా వర్గాల హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. కోయంబత్తూర్‌లో 2 వేల మంది పోలీసులను మోహరించారు. షాపింగ్ మాల్స్, ఆలయాలు, చారిత్రక ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. అనుమానిత-సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్నా రు. నగరంలో చెక్‌పోస్టులు పెంచి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తీర ప్రాంతం వెంబడి కూడా భద్రతను పెంచారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Similar News