అరుణ్ జైట్లీ ఆకస్మిక నిష్క్రమణ ప్రతి ఒక్కరినీ శోక సంధ్రంలో ముంచింది. వివాద రహితుడిగా, సున్నిత మనుస్కుడిగా,అజాత శతృవుగా పేరు తెచ్చుకున్నారు జైట్లీ. మోదీ మెుదటి సారి ప్రధాని అయిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాలలో ఆయనది కీలక పాత్ర. రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వెనుక నాటి ఆర్థిక మంత్రి జైట్లీ వ్యూహం ఉంది. జీఎస్టీని విజయవంతంగా పట్టాలెక్కించడంలో ఆయన కృషి మరువలేనిది. కేవలం కేంద్రమంత్రిగానే కాదు వ్యూహకర్తగా పార్టీ విజయంలో ఆయనది ‘కీ’లకపాత్ర. మోదీ 2.0 ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణలోమెుదటగా అరుణ్ జైట్లీ పేరు వినిపించినా అనారోగ్య కారణాలతో ఆయన ఆ అవకాశాన్ని కాదనుకున్నారు. వ్యూహకర్తగా, లాయర్‌గా, ప్రతిపక్ష నేతగా ఆయన సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తించారు. జ్ఞాపకాలను విడిచి, యావత్ దేశాన్ని శోకసంధ్రంలో ముంచి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.