కరీంనగర్ జిల్లాలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. హుజురాబాద్‌కు చెందిన విద్యార్థి ధర్మతేజ 28 వేలతో రెడ్‌మి సెల్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేశాడు. నాలుగు రోజుల తరువాత ఫ్లిప్‌కార్ట్ నుంచి వచ్చిన బాక్స్‌ను ఓపెన్ చేసి చూస్తే.. అందులో సెల్ తప్ప మిగతా ఆక్సరిస్ అన్ని ఉన్నాయి. తనకు వచ్చిన కొరియర్‌లో సెల్ లేకపోవడంతో ధర్మతేజ ఖంగుతిన్నాడు. తనకు జరిగిన మోసాన్ని మెయిల్ ద్వారా కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఒకటి కాదు రెండు కాదు 20 సార్లు కంపెనీకి మెయిల్ చేసిన రిప్లై రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు... కరీంనగర్ వినియోగదారుల మండలిని ఆశ్రయించాడు.