ఎంఐఎంతో జతకట్టిన టీఆర్‌ఎస్.. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది - ఎంపీ అరవింద్
ఎంఐఎంతో జతకట్టిన టీఆర్‌ఎస్.. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. 370 రద్దుతో దేశమంతా సంబరాలు చేసుకుంటే.. కవిత మాత్రం బాధగా ట్వీట్ చేశారని ఎద్దేవా చేశారు. గుండారం ఘటనపై ఇప్పటికే హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశామని.. అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా గుండారం గ్రామంలో బీజేపీ నేతలతో కలిసి పర్యటించారు అరవింద్.