Raghurama Krishnam Raju : రఘురామ కస్టోడియల్ కేసు.. మరిన్ని అరెస్టులు తప్పవా..?

Update: 2025-12-17 09:00 GMT

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ కేసులో కీలక మలుపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే కక్షతో రఘురామకృష్ణంరాజు మీద కస్టోడియల్ టార్చర్ చేయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఏ1 నిందితుడిగా సునీల్ కుమార్ ఉన్నారు. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొన్న ఆయనను విచారణకు పిలిపిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేసే ప్రయత్నమే చేశారు. ఎవరు టార్చర్ చేయమంటే చేశారు, పైనుంచి ఎవరు ఆర్డర్ వేశారు, ఎందుకు మెడికల్ రిపోర్టు మార్చేశారు అనే కోణంలో అధికారులు ప్రశ్నలు వేస్తే పీవీ సునీల్ కుమార్ తనకు తెలియదు గుర్తులేదు అన్నట్టు వంకర సమాధానాలు చెప్పారంట. అప్పటి ఆర్డర్లు, రిపోర్టులు చూపిస్తే బహుశా ఉండొచ్చేమో నాకు గుర్తులేదు అన్నట్టు తప్పించుకునే ప్రయత్నాలు చేశారు పివి సునీల్ కుమార్.

అయితే ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పేలా కనిపించట్లేదు. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసులో అప్పటి ఐజీగా ఉన్న సునీల్ నాయక్ ను మళ్లీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పట్లో ఆయన ఈ కేసు నుంచి రిలీఫ్ ఫండ్ ఎందుకు కోర్టుకు కూడా వెళ్లారు. ఆఫీసులో రఘురామకృష్ణంరాజు ఇంప్లీడ్ కావడంతో తప్పించుకునే అవకాశాలు లేకుండా పోయాయి. చూస్తుంటే త్వరలోనే ఆయన విచారణకు పిలుస్తారు. అలాగే గుంటూరు జిజి హెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి కూడా ఇప్పటిదాకా విచారణ ఎదుర్కోలేదు. ఆమె రఘురామకృష్ణంరాజు మెడికల్ రిపోర్టును మార్చి ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కాబట్టి ఆమెను కూడా విచారించి అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సునీల్ కుమార్ ను మరోసారి విచారించేలా ఉన్నారు. ఆయన పొంతన లేని సమాధానాలను బట్టి అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా నిందితుడుగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆయన కూడా విచారణకు పిలుస్తారా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ కేసులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన వాళ్లందర్నీ విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


Full View

Tags:    

Similar News