ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్‌‌న్యూస్‌

Update: 2019-08-28 06:19 GMT

రైల్వే శాఖ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్‌సిటీ, శతాబ్ధి, తేజాస్‌ వంటి పలు రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్లకు 25 శాతం తగ్గింపు ధరలను ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రోడ్డు రవాణా, విమాన సంస్థలు ఆఫర్స్‌తో ప్రయాణికులను అట్రాక్ట్ చేస్తున్న క్రమంలో వాటి పోటీ నుంచి తట్టుకునేందుకు రైల్వేలు ఈ నూతన పథకాన్ని ముందుకు తెచ్చాయి. ఏసీ చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ సదుపాయం ఉన్న అన్ని రైళ్లలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. టిక్కెట్ బేస్ ధరపై 25 శాతం వరకు తగ్గింపు ఇస్తూ ప్రయాణికులకు బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. గత ఏడాదిలో ఏ రైళ్లైతే తక్కువ ఆక్యుపెన్సీ కలిగి ఉన్నాయో వాటినే ఈ ఆఫర్‌లోకి తీసుకోచ్చింది రైల్వే మంత్రిత్వ శాఖ. డిస్కాంట్‌ ధరకు రిజర్వేషన్‌ ఫీజు, సూపర్‌ఫాస్ట్‌ చార్జ్‌, జీఎస్టీలు అదనం. ఈ ఆఫర్స్‌ను ఎప్పుడు ప్రకటించాలి అనే దానిపై రైల్వే శాఖ కసరత్తు చేపడుతోంది. డిస్కౌంట్‌ను ఏడాది పొడవునా కొనసాగించాలా లేదా సంవత్సరంలో ఒక నెలలోనా, లేక వారాంతాల్లోనా అనేది త్వరలో నిర్ణయించనుంది.

Similar News