EC : పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

Update: 2024-04-27 06:16 GMT

ఇంటింటికి పెన్షన్ల పంపిణీపై సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లించాలని తెలిపింది. వృద్ధులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలంది. పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వంపై చాలా ఫిర్యాదులు వచ్చాయన్న ఈసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టాలని గతంలో ఆదేశించామని..అవే మార్గదర్శకాలు అమలు చేయాలని సూచించింది. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కుదరని పక్షంలో డీబీటీల రూపంలో చెల్లింపులు జరపాలని ఈసీ స్పష్టం చేసింది. కాగా ప్రభుత్వ ఉద్యోగులను పింఛను నగదు పంపిణీకి ఉపయోగించుకోవాలని గతంలో ఈసీ సూచించింది.

ఎన్నికల వేళ ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా వారిని ఓపీఓలుగా తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల స్వీకరణ గడువును కూడా మే 1 వరకు పెంచింది.

Tags:    

Similar News