గణేష్‌ చందాల ముసుగులో దొంగల హల్‌చల్‌

Update: 2019-08-29 10:17 GMT

నిజామాబాద్‌ పట్టణంలో గణేష్‌ చందా ముసుగులో దొంగలు హల్‌చల్‌ చేశారు. చందా బుక్‌తో ఇళ్ల వద్ద వసూళ్లకు దిగారు. సాయికృపా నగర్‌లోని మొదటి అంతస్తులో ఓ ఇంట్లో చందా ఇవ్వకపోవడంతో మంచినీళ్లు అడిగి చైన్‌ స్నాచింగ్‌కు ప్రయత్నించారు. భయంతో అరుస్తూ ఆ మహిళ ఇంట్లోకి పరుగులు తీసింది. మహిళ అరుపులు విన్న స్థానికులు వాళ్లలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్ర దొంగగా గుర్తించిన పోలీసులు మిగిలినవారి కోసం సీసీ ఫూటేజ్‌ ఆధారంగా గాలిస్తున్నారు.

Similar News