దూసుకొస్తున్న హరికేన్... ఆందోళనలో ప్రజలు

Update: 2019-09-01 10:49 GMT

అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి జాతీయ హరికెన్ సెంటర్ హెచ్చరికలు జారీచేసింది. దీని ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. దీనిని అధికారులు కేటగిరి 4గా ప్రకటించారు. దక్షిణ, ఉత్తర కరోలినాతో పాటు జార్జియా ప్రాంతంలో భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని, ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఈ తుపాన్ ప్రభావం లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం చూపే అకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే డోరియన్ హరికెన్ తర్వాత మరో ఐదు రోజుల్లో మరో తుపాన్ పొంచి ఉందని నేషనల్ హరికెన్ సెంటర్ వెల్లడించింది. డోరియన్ హరికెన్ ను ఎదుర్కొనేందుకు అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, సహాయక చర్యలకు సర్వం సిద్దంచేశారు.

Similar News