హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, సంజీవరెడ్డి నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బాలానగర్, బోయినిపల్లి, లకడీకపూల్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. చాలా కాలనీలు చెరువులను తలపించాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఇక భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు.