బడ్జెట్ సమావేశాల కోసం కేసీఆర్ సర్కార్ సిద్ధమవుతోంది.. ఈనెల 9 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చీఫ్ విప్, విప్‌లను నియమించారు కేసీఆర్.. ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్‌ను నియమించారు. విప్‌లుగా గొంగడి సునీత, గంప గోవర్ధన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగ కాంతారావు, బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్ నియమించారు.