బంగారం ధర భారీగా తగ్గిందండోయ్..

Update: 2019-09-07 05:55 GMT

శుక్రవారం నాటి బులియన్ మార్కెట్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు అడ్డుకట్ట పడింది. ఆభరణాల తయారీ దారులనుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడడం బంగారం రేటు దగ్గడానికి కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ అన్నారు. బంగారంలో పెట్టుబడులు బలహీనంగా మారడాన్ని కూడా మరో కారణంగా చెబుతున్నారు. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.372 తగ్గి రూ.39,278కి చేరింది. ఇదిలా వుంటే, మరోపక్క వెండి ధర కూడా రూ. 1,273 తగ్గి కిలో రూ.49,187కు చేరింది. అంతర్జాతీయంగా న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,510 డాలర్లు పలికింది. ఇక వెండి ధర విషయానికి వస్తే అది కూడా భారీగా తగ్గి ఔన్సు18.30 డాలర్లుగా ఉంది.

Full View

Similar News