జింబాబ్వే మాజీ అధ్యక్షుడు కన్నుమూత

Update: 2019-09-07 04:06 GMT

జింబాబ్వేకు సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆఫ్రికాలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఆయన ఒకరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

2017 నవంబరులో జరిగిన సైనిక తిరుగుబాటుతో ముగాబే పదవి నుంచి వైదొలిగారు. 1980కి ముందు రోడీషియా పేరిట బ్రిటన్‌కు వలస రాజ్యంగా ఉండేది జింబాబ్వే. అప్పటి ప్రధాని అయాన్ స్మిత్ పాలనకు వ్యతిరేకంగా ముగాబే.. గెరిల్లా విముక్తి పోరాటాన్ని నడిపారు. జింబాబ్వే స్వాతంత్ర్యం పొందిన తర్వాత కొన్నాళ్లు ప్రధానిగా పనిచేశారు. ఆ తర్వాత 1987 నుంచి 2017 వరకు అధ్యక్ష హోదాలో కొనసాగారు.

Also watch :

Full View

Similar News