నియంతృత్వ అడుగు జాడల్లో కేసీఆర్ పాలన సాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిజాం ఆలోచనలు అమలు చేస్తున్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఉద్యమ ఆకాంక్షలు మరిచి.. తన కుటుంబంతోనే తెలంగాణ వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో యూనియన్ నేతలు తమ సమస్యలను నేరుగా సీఎంకు చెప్పుకునే వారని.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా కలిసే పరిస్థితి లేదన్నారు. అందుకే అంతా టీఆర్‌ఎస్ ను వీడుతున్నారన్నారు.. తాజాగా తెలంగాణలో పని చేస్తున్న చాలామంది టీచర్లు బీజేపీలో చేరడం సుదినం అన్నారు కిషన్ రెడ్డి.