తెలంగాణ కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్ చౌహాన్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు, విపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకకు హాజరయ్యారు. తమిళనాడు నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు మరో ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. అతిరథుల రాకతో రాజ్‌భవన్ కళకళలాడింది. ఈ వేడుకలో హరీష్, కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
అంతకుముందు.. బేగంపేట ఎయిర్‌పోర్టులో తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆమెకు మంత్రులందర్నీ సీఎం పరిచయం చేశారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకున్నారు. అనంతరం ఆమె ముఖ్య అధికారులందర్ని పరిచయం చేసుకున్నారు.