పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనానికి డిమాండ్ పెరుగుతోంది. తాజాగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి సైన్యం రెడీగా ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే మిగిలి ఉందని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఓకే చెప్పడమే ఆలస్యం పీఓకేను స్వాధీనం చేసుకుంటామన్నారు.
ఆర్టికల్-370 రద్దు నేపథ్యంలో పీఓకే స్వాధీనంపై అందరి దృష్టి నెలకొంది. పీఓకే కూడా భారత్‌లో అంతర్భాగమని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే పీఓకేపైనే జరుగుతాయని రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్ తేల్చి చెప్పారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కూడా పీఓకేను స్వాధీనం చేసుకోవడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కూడా పీఓకేను స్వాధీనం చేసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
Also watch :